చార్మినార్‌లో సర్దార్ మహాల్‌కు కొత్త అందాలు

*చారిత్రక కట్టడాలు భవిష్యత్తు తరాల వారికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి

Update: 2022-05-12 06:19 GMT

చార్మినార్‌లో సర్దార్ మహాల్‌కు కొత్త అందాలు

Hyderabad: అందమైన భాగ్యనగరం మనది. ఘన చరిత్రకు సాక్ష్యం. అద్భుతమైన వారసత్వ సంపదకు నిలయం. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో ఎన్నో అద్భుతమైన కట్టడాలు, ప్రాంతాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. వీటిలో ప్రదానంగా పాతబస్తీలో ఉన్న సర్దార్ మహాల్‌. ఇప్పుడు ఈ సర్దార్ మహాల్‌ను కల్చరల్ భవనంగా ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో పురాతన కట్టడాల పరిరక్షణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిలో ప్రధానంగా ఉన్న ఏళ్ల నాటి చారితాత్మక భవనాలు అయిన చార్మినార్‌, గోల్కొండ, అసెంబ్లీ భవనం, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీదు, సాలార్‌జంగ్‌ మ్యూజియం ఇలా ఎన్నో అద్భుత నిర్మాణాలు వారసత్వ కట్టడాలుగా ఖ్యాతి పొందాయి. దీనిలో సర్దార్ మహల్‌ను ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన భార్యలలో ఒకరైన సర్దార్ బేగం కోసం 1900లో యూరోపియన్ శైలిలో దీన్ని నిర్మించాడు. నిర్మాణం పూర్తయ్యాక దీన్ని చూసిన సర్దార్ బేగానికి అది నచ్చలేదు. దాంతో ఆమె అసలక్కడ నివసించనే లేదు. అనేక సంవత్సరాల పాటు అది అలాగే ఉంది. అయితే, భవనానికి మాత్రం ఆమె పేరే వచ్చింది.

ఈ భవనంలో కొంతకాలం చార్మినార్ యునాని ఆసుపత్రి నడిచింది. ఆ తరువాత సిటీ సివిల్ కోర్టు ఇక్కడ పనిచేసింది. 1965లో దీనికి ఆస్తి పన్ను కట్టకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఈ సర్దార్ మహల్‌ను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి వారి సర్కిల్ కార్యాలయం ఈ భవనంలో పనిచేసింది. 2011లో ఈ భవనాన్ని మ్యూజియంగా మార్చారు. హెరిటేజ్ కన్సర్వేషన్ కమిటీ ఇంటాక్ సంస్థ దీన్ని హెరిటేజ్ భవనంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ సర్దార్ మహల్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులు కూడా మొదలయ్యాయి.

ఈ సర్దార్ మహాల్‌‌ను సాంస్కృతిక, పర్యాటక భవనంగా మార్చేందుకు GHMC శ్రీకారం చుట్టింది. అందుకోసం టెండర్లను కూడా ఆహ్వానించింది. చార్మినార్‌కు అతి దగ్గరలో ఉన్న సర్దార్ మహాల్‌ను పునరుద్దరిస్తే పర్యాటకంగా ఎంతో అబివృద్ది చెందే అవకాశం ఉంది.

Full View


Tags:    

Similar News