TS News: డిమాండ్ల పరిష్కారానికి పారిశుధ్య కార్మికుల ఆందోళన

TS News: సమస్య పరిష్కరించే వరకు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరిక

Update: 2023-02-13 06:52 GMT

TS News: డిమాండ్ల పరిష్కారానికి పారిశుధ్య కార్మికుల ఆందోళన

TS News: కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, రెండు సంవత్సరాలుగా ESI, PF డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 74 మంది పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నామని, తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యామని, అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని వాపోయారు. సమస్య పరిష్కారమయ్యే వరకు కార్యాలయం ఎదుట తాము ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News