ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్..

Update: 2019-07-15 07:28 GMT

కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు జలదీక్షకు వెళుతున్న ఆయనతో పాటు దీక్షకు సిద్ధమైన జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డి కూతురు జయారెడ్డిని అరెస్ట్‌ చేసి కొండాపూర్‌ పీఎస్‌కు తరలించారు. గత కొద్ది రోజులుగా ఆయన సంగారెడ్డికి గోదావరి జలాలను తరలించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గోదావరి జలాలను తమ జిల్లాలకు తరలించే వరకూ నిరాహార దీక్షకు పూనుకుంటానని వెల్లడించారు. కాగా సింగూరు జలాయశం ఎండిపోవడం కారణంగా సంగారెడ్డికి నీటి కొరత ఏర్పడిందని కొంతకాలంగా ఆరోపిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీనికి మాజీమంత్రి హరీశ్ రావే కారణమని ఆరోపణలు గుప్పించారు. ఇక దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని జగ్గారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జలదీక్షకు దిగాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. గోదావరి జలలాలను తమ జిల్లాలకు తరలించేవరకు తమ పోరాటం ఆగదని జగ్గారెడ్డి తెలిపారు.



Tags:    

Similar News