Sangareddy: మనవడిని కిడ్నాప్ చేయించిన తాత

Sangareddy Kidnapping Case: సంగారెడ్డి జిల్లా తాడ్మనుర్ గ్రామంలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది.

Update: 2025-10-10 08:30 GMT

Sangareddy Kidnapping Case: సంగారెడ్డి జిల్లా తాడ్మనుర్ గ్రామంలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మనవడిపై ప్రేమతో తాత బాబురావు తన బంధువులతో కలిసి కిడ్నాప్‌ చేయించాడు. గుర్తు తెలియని దుండగులు పవన్‌ను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహించి విచారణ చేపట్టారు. ప్రధాన సూత్రధారి అయిన బాబురావు, బాలుడిని కిడ్నాప్ చేసిన సునీల్, రవిలను అదుపులోకి తీసుకున్నారు. పవన్‌ను తల్లి పద్మకు అప్పగించి, నిందితులపై కేసు నమోదు చేశారు. 

Tags:    

Similar News