విద్యాశాఖ మంత్రి సబితకు గవర్నర్ అపాయింట్మెంట్
Sabitha Indra Reddy: రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతిభవన్ ఎపిసోడ్లో రేపు కీలక భేటీ జరగనుంది.
విద్యాశాఖ మంత్రి సబితకు గవర్నర్ అపాయింట్మెంట్
Sabitha Indra Reddy: రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతిభవన్ ఎపిసోడ్లో రేపు కీలక భేటీ జరగనుంది. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ తమిళిసైకి వివరణ ఇవ్వనున్నారు. బిల్లును పెండింగ్‌లో పెట్టిన గవర్నర్ తనకు సందేహాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో కలిసి రేపు గవర్నర్‌తో సమావేశం కానున్నారు.
రాజ్‌భవన్ వర్గాలు రేపు మధ్యాహ్నం రావాలని మంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చాయి. తనకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇంకా లభించలేదని మంత్రి సబిత అనడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిన్న ప్రెస్మీట్లో గవర్నర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమిళిసై కామెంట్స్‌తో తెలంగాణలో పొలిటికల్ కాక రేపాయి. ఈ నేపథ్యంలో రేపు తమిళిసైతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీకానుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.