Sri Chaitanya College: సాత్విక్ ఆత్మహత్యపై విద్యాశాఖ మంత్రి సబిత యాక్షన్..

Sri Chaitanya College: సాత్విక్ ఆత్మహత్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.

Update: 2023-03-01 05:34 GMT

Sri Chaitanya College: సాత్విక్ ఆత్మహత్యపై విద్యాశాఖ మంత్రి సబిత యాక్షన్..

Sri Chaitanya College: సాత్విక్ ఆత్మహత్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలిచ్చారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ చేసిన మంత్రి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే స్టూడెంట్ మృతిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో... కృష్ణారెడ్డి, ఆచార్య, వార్డెన్ నరేష్ పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. శ్రీచైతన్య కళాశాలలో ఫస్టియర్ స్టూడెంట్ సాత్విక్ సూసైడ్ కలకలం రేపింది.

కాలేజీలో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సిబ్బంది పట్టించుకోలేదని.. లిఫ్ట్ అడిగి సాత్విక్ ను ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. హాస్టల్ లో టార్గెట్ చేసి తమను కొడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాత్విక్ మృతిపై శ్రీచైతన్య కాలేజీ ముందు NSUI, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News