ఆర్టీసీ సమ్మె ప్రభావం.. సంక్రాంతి సెలవులు కుదింపు

గత సంవత్సరం విజయదశమి పండుగ సమయంలో అక్టోబర్ 5 నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మెలో పాల్గొ్న్న సంగతి తెలిసిందే.

Update: 2020-01-08 13:49 GMT
Students File Photo

గత సంవత్సరం విజయదశమి పండుగ సమయంలో అక్టోబర్ 5 నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మెలో పాల్గొ్న్న సంగతి తెలిసిందే. ఆ సమ్మె కారణంగా తెలంగాణలో సామాన్య ప్రజలు అనే ఇబ్బందులు ఎదర్కొన్నారు. అంతే కాకుండా దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రైవేటు వాహనాల్లో వెళ్లాంటే చార్జీలు చూసి బేంబెలెత్తిపోయారు. తాత్కాలిక డ్రైవర్లు కండెక్టర్లను ప్రభుత్వం నియమించింది. అయితే దసరా అధికారులు సెలవులను పొడిగించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు బస్సులను ప్రయాణికుల కోసం ఉపయోగించారు.

ఈ నేపథ్యంలో విద్యార్థాలకు తరగతుల నిర్వహణలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఈ క్రమంలో సిలబస్ పూర్తి చేయడానికి కూడా రెండో శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రకటించారు. అంతే కాకుండా సంక్రాంతి సెలవులు కూడా ప్రభుత్వం కుదించింది. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉత్తర్వుల ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు రోజులుగా నిర్ణయించారు. తాజాగా వీటిని 12 నుంచి 16 వరకు కుదించారు. బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా.. రెండో శనివారం కూడా పని దినాలు కూ ప్రకటిస్తు బుధవారం ఉత్తర్వలు అధికారులు జారీ చేశారు. ఆరు రోజుల సెలవులను కాస్తా ఐదు రోజులకు కుదించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ చెందిన కొంత మంది సర్కార్ నిర్ణయంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ఎక్కువరోజులు ఉన్నందువల్ల సిలబస్ పూర్తి చేయలేకపోయామని అందుకే సెలవురు తగ్గించినట్లు తెలిపారు. ఆరు రోజుల సెలవులను కాస్త ఐదు రోజులకు తగ్గించడంతో కొందరు ఉపాద్యాయులు, విద్యార్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

 

Tags:    

Similar News