RS Praveen Kumar: బీఎస్పీకి RS ప్రవీణ్ కుమార్ రాజీనామా
RS Praveen Kumar: బీఎస్పీకి RS ప్రవీణ్ కుమార్ రాజీనామా
RS Praveen Kumar: బీఎస్పీకి RS ప్రవీణ్ కుమార్ రాజీనామా
RS Praveen Kumar: తెలంగాణ బీఎస్పీకి బిగ్ షాక్ తగిలింది. ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బరువెక్కిన హృదయంతో నిర్ణయం తీసుకున్నాను అంటూ ప్రకటించారు. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు విషయం బయటికి రాగానే.. పొత్తును భగ్నం చేసేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చెస్తోందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీజేపీ కుట్రలకు భయపడి నమ్ముకున్న సిద్ధాంతాలకు, విలువలకు తిలోదకాలు ఇవ్వలేనంటూ ప్రకటించారు. అయినా.. పోరాటాన్ని ఆపేది లేదని.. చివరి వరకూ బహుజన వాదాన్ని గుండెళ్లో పదిలంగా దాచుకుంటానంటూ భావోద్వేగంతో ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
కాగా.. బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కేసీఆర్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. పొత్తు నేపథప్యంలోనే తాను రాజీనామా చేసినట్టు ప్రకటించిన ఆర్ఎస్పీ.. మళ్లీ.. కేసీఆర్‌తో భేటీ కావడంతో.. సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.