Siddipet: సిద్ధిపేట పట్టణంలో రోబో రెస్టారెంట్.. కస్టమర్లను పలకరిస్తూ, ఫుడ్ సర్వ్ చేస్తున్న రోబోలు

Siddipet: కస్టమర్లను పలకరిస్తూ, ఫుడ్ సర్వ్ చేస్తున్న రోబోలు

Update: 2024-02-04 06:53 GMT

Siddipet: సిద్ధిపేట పట్టణంలో రోబో రెస్టారెంట్.. కస్టమర్లను పలకరిస్తూ, ఫుడ్ సర్వ్ చేస్తున్న రోబోలు

Siddipet: అక్కడ రెస్టారెంట్‌లోకి వెళ్లగానే రోబోలు స్వాగతం పలుకుతాయి. ఏం కావాలో ఆర్డర్ కూడా తీసుకుంటున్నాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా బిర్యాని అంటే బిర్యాని, ఏదంటే అది వడ్డిస్తాయి. అతిథులకు ఏ లోటు రాకుండా చూసుకుంటాయి. అందుకే అది రోబో రెస్టారెంట్‌గా మారిపోయింది. ఇంతకు ఈ రోబో రెస్టారెంట్ ఎక్కడుందో..చూసొద్దాం పదండి.

మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వినూత్నంగా ఆలోచించాడు సిద్ధిపేటలో ఓ రెస్టారెంట్ నిర్వహకుడు. కస్టమర్లను ఆకర్షించడానికి రోబోలను ఏర్పాటు చేశాడు. రెస్టారెంట్‌కు వచ్చిన వారికి రోబోలతో సర్వ్ చేయిస్తూ.. కొత్త అనుభూతిని కల్గిస్తున్నాడు.

సిద్ధిపేట పట్టణంలో ఉంది ఈ రోబో 2. 0 ఫ్యామిలీ రెస్టారెంట్. హైదరాబాద్ నుంచి ఆరు లక్షలతో కొనుగోలు చేసి తీసుకొచ్చారు. రోబోలు చార్జింగ్ బ్యాటరీల సాయంతో పని చేస్తాయి. భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్లగానే ముందుగా కస్టమర్లు కూర్చున్న టేబుల్ వద్దకు వచ్చి రోబోలు నమస్కారం చెప్పి వెల్‌కమ్ చెబుతాయి. నా పేరు మైత్రీ. ఫుడ్ ఆర్డర్ చేయండి సార్, మేడమ్ అని పలకరిస్తాయి. మనకు నచ్చిన భోజనం ఆర్డర్ చేసిన తర్వాత మరో రోబో ఆర్డర్ చేసిన భోజనం ప్లేట్లో కస్టమర్ కూర్చున టేబుల్ వద్దకు తీసుకొస్తుంది. దీంతో రోబోలను చూసి భోజన ప్రియులు కొత్త అనుభూతిని పొందుతున్నారు.

పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా, కస్టమర్లను ఆకర్షించే విధంగా వినూత్న పద్ధతిలో రోబోలను ఏర్పాటు చేసి వాటి సాయంతో భోజనాన్ని సరఫరా చేస్తూ హోటల్ను నిర్వహిస్తున్నారు. ఈ రోబో ఫ్యామిలీ రెస్టారెంట్ లో చిన్నపిల్లలు అదుకోవడానికి ప్రత్యేకంగా గేమ్స్ జోన్, రాత్రి సమయంలో ప్రత్యేక లైటింగ్, హోం థియేటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు.

రోబో ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేశారని తెలిసి కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి వస్తున్నారు కస్టమర్లు. ఫుడ్ ఆర్ధర్ చేస్తే రోబోలు భోజనం తీసుకురావడం, ఆవి మాట్లాడడం డిపరెంట్ గా ఉందంటున్నారు. పిల్లలు రోబోలతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి రావడం సంతోషంగా ఉందంటున్నారు.

Tags:    

Similar News