నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురు మృతి

Update: 2019-11-18 03:15 GMT
road accident nizamabad

నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు- ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఒకే గ్రామనికి చెందిన ఐదుగురు మృతి చెందారు. జిల్లాలోని ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామనికి చెందిన ప్రెసిడెంట్ పొట్టోళ్ల సాయి తన కూతురు పుట్టువెంట్రుకలు కార్యక్రమాన్ని కుర్నాపల్లి అబ్బయ్య దర్గా వద్ద నిర్వహించారు. కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తుండగా అదే గ్రామనికి చెందిన జక్కం గంగామణి (62), బాలమణి (65), చిక్కెల సాయిలు (68), కల్యాపురం సాయిలు (68),తోపాటు నయిం( 27) అంతా కలిసి ఆటోలో పయనమయ్యారు.

సాయంత్రం ఆటో ఆలీసాగర్ - జాన్కంపేట మలుపు తిరుగుతుడగా నిజామాబాద్ వైపు నుంచి రహాదారిపై వేగంగా వస్తున్న కారు వారిని ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టి రహదారి పక్కన ఉన్న 10 అడుగుల లోతైన గుంతలో పడింది. కారు కూడా ఆటోపై పడింది. దీంతో ఆటోవున్నవారంతా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు.

మృతి చెందిన వారిలో బాలమణి, గంగామణి అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఒకే కుటుంబానకి చెందిన వారు. జాన్కంపేట గ్రామనికి ఐదుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కారులో ప్రయాణిస్తున్నవారికి స్పల్పగాయాలైయ్యాయి. కారులో ఉన్నవారు మద్యం సేవించినట్లుగా తెలుస్తోంది. కారును వేగంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలాన్ని ఎస్సై ఎల్లాగౌడ్ పరిశీలించారు.  

Tags:    

Similar News