Mahabubabad: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
Mahabubabad: ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్రగాయాలు
Mahabubabad: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో సంక్రాంతి పండుగ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఓ కుటుంబాన్ని.. కారు రూపంలో మృత్యువు వెంబడించింది. కంబాలపల్లి శివారు అటవీశాఖ అర్బన్ పార్కు సమీపంలో గూడూరు వైపు వెళ్తున్న ఆటోను మహబూబాబాద్‌కు వస్తున్న కారు ఎదురుగా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గూడూరు మండలం చిన్న ఎల్లాపురం గ్రామానికి చెందిన ఇస్లావత్ శ్రీను ఈ నెల 13న నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలోని బుడియాబాపు గుడికి.. తన కుమారుడి తలనీలాలు సమర్పించడానికి వెళ్లాడు.
అయితే ఆదివారం తిరుగు ప్రయాణంలో మహబూబాబాద్ జిల్లా జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను సహా ఆయన తల్లి, ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే కారులో ప్రయాణిస్తున్న మల్యాలకు చెందిన డాక్టర్ తిరుపతి.. తన మిత్రులతో కలిసి కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మగుడికి వెళ్తున్నారు. అయితే కారు వేగంగా డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.