Hyderabad: హైదరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం

Hyderabad: హైదరాబాద్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం

Update: 2022-12-25 10:45 GMT

హైదరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం 

Hyderabad: హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా ప్రయాణిస్తున్న క్వాలిస్ వాహనం ఓవర్ బ్రిడ్జ్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే వాహనంలో ప్రయాణిస్తున్న యువకులు హుక్కా పీలుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హుక్కా మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News