Road Accident: హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
Road Accident: టిప్పర్ వెనక నుంచి ఢీ కొట్టిన స్కార్పియో
Representational Image
Road Accident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం తానేదార్ పల్లికి చెందిన ఎంపిటీసీ దొంతం కవిత, ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి మృతి చెందారు. తిప్పర్తి నుంచి నిన్న సాయంత్రం 8గంటల సమయంలో నల్లగొండ నుంచి భార్యాభర్తలు తమ స్కార్పియో వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరారు.. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓఆర్ఆర్ దాటగానే యూ టర్న్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో టిప్పర్ వెనక భాగంలో వేణుగోపాల్ రెడ్డి వాహనం బలంగా ఢీ కొట్టింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో భార్యాభర్తలిద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.. వీరిని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.. వారం రోజుల కిందటనే నల్గొండలో తమ కుమార్తె వివాహాన్ని వైభవంగా జరిపించారు అంతలోనే ఇద్దరు మృతి చెందడంతో.. బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.