Revanth Reddy: సంచలనం రేపుతున్న రేవంత్ ట్వీట్
Revanth Reddy: టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలనమైన రీతిలో ట్వీట్ చేశారు.
Revanth Reddy: సంచలనం రేపుతున్న రేవంత్ ట్వీట్
Revanth Reddy: టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలనమైన రీతిలో ట్వీట్ చేశారు. దాన్ని మామూలు ట్వీట్ అనేకంటే... ఓ వార్నింగ్ లాంటిదే అంటున్నారు పార్టీ నేతలు. కాంగ్రెస్ కు ఐకమత్యమే మహాబలమని, అందుకు భిన్నంగా ఎవరైనా సరే పార్టీ ముఖ్యులపై, వివిధ హోదాల్లో ఉన్న నాయకులపై, బహిరంగంగా లేదా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే పార్టీ నుండి శాశ్వత బహిష్కరణతో పాటు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రాహుల్ తో సమావేశం తరువాత అసంతృప్త నేతలను దారికి తెచ్చుకునే క్రమంలో రేవంత్ కు హైకమాండ్ మరిన్ని అధికారాలు కట్టబెట్టిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.