Revanth Reddy: కాంగ్రెస్‌ శ్రేణులకు రేవంత్ రెడ్డి సంచలన పిలుపు

Revanth Reddy: రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Update: 2023-07-29 11:26 GMT

Revanth Reddy: కాంగ్రెస్‌ శ్రేణులకు రేవంత్ రెడ్డి సంచలన పిలుపు

Revanth Reddy: రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్‌రెడ్డి వరద ప్రాంతాలను పరిశీలించి.. ముంపు ప్రాంతాలలో ప్రజలతో మాట్లాడారు. వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులు, కేటీఆర్ విలాసాలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని ధ్వజమెత్తారు. అత్యంత బాధ్యతా రాహిత్యంతో వ్యవ‌హ‌రిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, పిండ ప్రదానం చేయాల‌ని రేవంత్‌ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రానికి శాంతి క‌లుగుతుంద‌న్నారు రేవంత్ రెడ్డి.

Tags:    

Similar News