Revanth Reddy Speech: అసెంబ్లీలో 2 గంటల ఫైర్ బ్రాండ్ స్పీచ్.. నీళ్ల విషయంలో తగ్గేదేలే అన్న రేవంత్ రెడ్డి.!!

Revanth Reddy Speech: అసెంబ్లీలో 2 గంటల ఫైర్ బ్రాండ్ స్పీచ్.. నీళ్ల విషయంలో తగ్గేదేలే అన్న రేవంత్ రెడ్డి.!!

Update: 2026-01-04 01:54 GMT

Revanth Reddy Speech: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ ప్రసంగంతో రాజకీయ వేడి రాజేశారు. రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు దాదాపు రెండు గంటల పాటు ఆయన ఏకధాటిగా, అనర్గళంగా మాట్లాడారు. ముఖ్యంగా కృష్ణా జలాల కేటాయింపు, పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల అంశాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును తీవ్రంగా విమర్శించారు.

నీటిపారుదల రంగంలో తెలంగాణకు జరిగిన నష్టానికి నాటి సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావునే పూర్తిగా బాధ్యత వహించాలని రేవంత్ ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర హక్కులను సరిగా వినియోగించుకోలేకపోయారని, రాజకీయ స్వార్థాల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు రాష్ట్రంపై భారంగా మారాయని వ్యాఖ్యానించారు.

అయితే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని సీఎం స్పష్టం చేశారు. “నీళ్ల విషయంలో ఇకపై తెలంగాణకు అన్యాయం జరగనివ్వం. రాష్ట్ర హక్కుల కోసం కేంద్రం దగ్గరైనా, ట్రిబ్యునళ్ల దగ్గరైనా గట్టిగా పోరాడుతాం” అని తేల్చిచెప్పారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.

ప్రసంగం మొత్తం పాటు అధికార, ప్రతిపక్ష బెంచీల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్నప్పటికీ రేవంత్ తన వాదన నుంచి వెనక్కి తగ్గలేదు. స్పష్టమైన గణాంకాలు, రాజకీయ విమర్శలతో ఆయన ప్రసంగం అసెంబ్లీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం వ్యాఖ్యలతో నీటి రాజకీయాలు మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Tags:    

Similar News