Revanth Reddy: ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా.. ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా
Revanth Reddy: రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు
Revanth Reddy: ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా.. ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నెల రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు. నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందన్నారు. రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న.. తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా తన బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పారు. పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తున్నామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మహాలక్ష్ములు ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూన్నామన్నారు.
నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందన్నారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామన్నారు. పారిశ్రామికవృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. నగరాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. మత్తులేని ఛైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందన్నారు.
కాగా తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా పేరు మార్చారు. ప్రగతిభవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను తొలగించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్‌లో ప్రతీ మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు హామీలు, మహిళలకు ఉచిత జర్నీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు పెంచారు. ఆరు గ్యారంటీల దరఖాస్తు కోసం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు.