Revanth Reddy: జోరు వానలో హోరెత్తించిన రేవంత్
Revanth Reddy: దళితబంధు పథకం కింద ఇస్తున్న 10 లక్షలు కేసీఆర్ పెడుతున్న బిక్ష కాదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy: జోరు వానలో హోరెత్తించిన రేవంత్
Revanth Reddy: దళితబంధు పథకం కింద ఇస్తున్న 10 లక్షలు కేసీఆర్ పెడుతున్న బిక్ష కాదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. పన్నుల రూపంలో ప్రజలు కట్టిన సొమ్మునే పంచుతున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. రావిరాల గడ్డ మీద జోరు వానలోనూ రేవంత్ మాటల తూటాలతో హోరెత్తించారు. ఇంద్రవెళ్లిలో తొలి అడుగు వేసిన కాంగ్రెస్ పార్టీ రావిరాలలో మలి అడుగు వేయగా, మరో అడుగు కేసీఆర్ నెత్తిమీద వేస్తామని వ్యాఖ్యానించారు.
వర్షంలో తడుస్తూనే రేవంత్‌రెడ్డి తన ప్రసంగం కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, సీనియర్ నేతలు మల్లు రవి, కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ తదితరులు బహిరంగ సభకు హాజరయ్యారు. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో రావిర్యాల జనసంద్రంగా మారింది.