Revanth Reddy: కవితను సిట్ ఆఫీస్‌కు పిలిచి ఎవరు పార్టీ మారమన్నారో స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలి..
Revanth Reddy: ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Revanth Reddy: కవితను సిట్ ఆఫీస్‌కు పిలిచి ఎవరు పార్టీ మారమన్నారో స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలి..
Revanth Reddy: ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మారాలని బీజేపీ నేతలు సంప్రదించారని కవిత ఒప్పుకున్నారన్నారు. కవితను సిట్ ఆఫీస్‌కు పిలిచి ఎవరు పార్టీ మారమన్నారో స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని కోరారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు తరహాలో దర్యాప్తు జరుపాలన్నారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై అధికారులను ఉపయోగించుకొని కేసులు నమోదు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజలందరూ ఈ రెండు పార్టీల గురించి చర్చించుకోవాలనే వ్యూహాత్మక కుట్రలో భాగంగానే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.