Phone Tapping: మోడీ, కేసీఆర్‌ ప్రభుత్వాలు దేశ ద్రోహానికి పాల్పడ్డాయి

Phone Tapping: సుప్రీంకోర్టు జడ్జిలు, ప్రతిపక్ష నాయకులు, మీడియా సంస్థల యజమానులు, సీనియర్‌ జర్నలిస్టులతో పాటు చాలామంది ప్రముఖల ఫోన్లు..

Update: 2021-07-20 12:31 GMT

Phone Tapping: మోడీ, కేసీఆర్‌ ప్రభుత్వాలు దేశ ద్రోహానికి పాల్పడ్డాయి

Phone Tapping: సుప్రీంకోర్టు జడ్జిలు, ప్రతిపక్ష నాయకులు, మీడియా సంస్థల యజమానులు, సీనియర్‌ జర్నలిస్టులతో పాటు చాలామంది ప్రముఖల ఫోన్లు ‌హ్యాక్‌కు గురయ్యాయని, దీని వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు ఎంపీ రేవంత్‌రెడ్డి. ఇజ్రాయల్‌ దేశంలోని ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదం నుంచి దేశాన్ని కాపాడటం, దేశ భద్రతకు భంగం కలగకుండా చూసేందుకు వాడతారన్నారు. కానీ మోడీ సర్కార్‌ దానికి కాకుండా ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షనేతలు, మీడియా ప్రతినిధుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసేందుకు వాడుతూ దేశద్రోహానికి పాల్పడిందన్నారు రేవంత్.

ఇక ఇదే ఇజ్రాయెల్ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ ప్రభుత్వం కూడా కొనుగోలు చేసి, రాష్ట్రంలోని ప్రతిపక్షాల నేతలు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తోందని ఆరోపించారు రేవంత్‌రెడ్డి. దాదాపు 50 మంది హ్యాకర్స్‌ను నియమించుకొని తెలంగాణ ప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడుతోందన్నారు. మోడీ, కేసీఆర్‌ ప్రభుత్వాలు దేశ ద్రోహానికి పాల్పడుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈ నెల 22న చలో రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చారు రేవంత్‌రెడ్డి.

Tags:    

Similar News