Revanth Reddy: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
Revanth Reddy: రైతుల సమస్యలు పరిష్కరించాలి
Revanth Reddy: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
Revanth Reddy: ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పత్తికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పత్తి క్వింటాల్‌కు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలన్నారు. వెంటనే లక్ష రూపాయల రుణ మాఫీని అమలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ప్రైవేట్ అప్పుల విషయంలో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేయాలని కోరారు. కౌలు రైతులను గుర్తించి వారికి రైతులకు అందే అన్ని రకాల పథకాలు అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. పంటల బీమా పథకాలు అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.