Revanth Reddy: రవీందర్‌ది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వం చేసిన హత్య
Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Revanth Reddy: రవీందర్‌ది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వం చేసిన హత్య
Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి బాండెడ్ లేబర్ల కంటే అధ్వానంగా ఉందన్నారు. రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే వాళ్లు ఎలా బతుకుతారంటూ ప్రశ్నించారు. హోంగార్డు రవీందర్‌ను ఉన్నతాధికారులు వేధించారని రేవంత్‌రెడ్డి లేఖలో ఆరోపించారు. రవీందర్‌ది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి సీఎం కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. హోంగార్డుల సమస్యలను పరిష్కరించకపోతే కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తుందని హెచ్చరించారు. హోంగార్డు రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.