Harish Rao: మల్కాజిగిరి నియోజకవర్గాన్ని రేవంత్ పట్టించుకోలేదు.. ఇక్కడ ఈ ఎన్నికల్లో మనం గెలిచి సత్తా చాటాలి..

Harish Rao: మల్కాజిగిరి నియోజకవర్గాన్ని రేవంత్ పట్టించుకోలేదు.. ఇక్కడ ఈ ఎన్నికల్లో మనం గెలిచి సత్తా చాటాలి..

Update: 2024-01-21 13:45 GMT

Harish Rao: మల్కాజిగిరి నియోజకవర్గాన్ని రేవంత్ పట్టించుకోలేదు.. ఇక్కడ ఈ ఎన్నికల్లో మనం గెలిచి సత్తా చాటాలి..

Harish Rao: 2009లో మనకు పది సీట్లే వచ్చాయని, ఇక మన పని అయిపోయిందని కేసీఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆ‍యన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నియోజకవర్గాన్ని ఎపుడూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.

ఇక్కడ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలిచి సత్తా చాటాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్ అభాసు పాలైందని ఎద్దేవా చేశారు. కర్నాటక పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయని అన్నారాయన.. ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు కర్ణాటక లాంటి పరిస్థితే ఉంటుందని జోస్యం చెప్పారు.

Tags:    

Similar News