ఖమ్మం అగ్నిప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి
Revanth Reddy: మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్న రేవంత్
ఖమ్మం అగ్నిప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్ని ప్రమాదం ఘటన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాలకు ముగ్గురు పేదలు అగ్నికి ఆహుతి అయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం పేరుతో చేస్తున్న రాజకీయాలు ప్రజల పాలిట శాపంగా మారాయని అన్నారు . మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని రేవంత్ తెలిపారు .ప్రభుత్వం గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు .మృతి చెందిన కుటుంబాలను BRS అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.