కులగణన సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణ శిక్ష:రేవంత్ రెడ్డి

కులగణన సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీభవన్ లో జరిగిన కులగణనపై జరిగిన పవర్ పాయింట్ ప్రజేంటేషన్ లో ఆయన పాల్గొన్నారు.

Update: 2025-02-14 14:52 GMT

 కులగణన సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీభవన్ లో జరిగిన కులగణనపై జరిగిన పవర్ పాయింట్ ప్రజేంటేషన్ లో ఆయన పాల్గొన్నారు. కుల గణన సర్వేను తప్పు బడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారన్నారు.

తన పదవి కోసం, తన కోసం కులాల సర్వే చేయలేదన్నారు. త్యాగానికి సిద్దపడే కులగణన చేసినట్టు ఆయన చెప్పారు. కులాల లెక్కలు తేల్చామన్నారు.రాహుల్ గాంధీఇచ్చిన మాటను నిలబెట్టేందుకు తాను ఈ ప్రయత్నం చేసినట్టు ఆయన చెప్పారు. అవసరమైతే తాను కార్యకర్తగా మిగిలేందుకు సిద్దమేనని ఆయన అన్నారు.

కులగణన చట్ట ప్రకారం జరిగిత చట్టప్రకారం రిజర్వేషన్లు సాధించుకోవచ్చన్నవారు. ఈ విషయంలో కోర్టులో కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఇంటి ముందు సర్వేలో పాల్గొనాలని డప్పు కొట్టాలని ఆయన బీసీ సంఘాలను కోరారు. సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణే శిక్ష అని ఆయన అన్నారు.

Tags:    

Similar News