Revanth Reddy: కేసీఆర్‌కు వ్యతిరేకంగా పునరేకీకరణ జరగాలి
Revanth Reddy: పార్టీ కోసం, ప్రజల కోసం మెట్టు దిగేందుకు నేను సిద్ధం
Revanth Reddy: కేసీఆర్‌కు వ్యతిరేకంగా పునరేకీకరణ జరగాలి
Revanth Reddy: బీజేపీలో చేరిన నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పునరేకీకరణ జరగాలన్న ఆయన.. కేసీఆర్‌ను ఓడించడం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వాళ్లు తిరిగి చేరుతామంటే కాంగ్రెస్ తల్లిలా చేర్చుకుంటుందన్నారు. కాంగ్రెస్ తన నాయకత్వంలో పనిచేయడం లేదని.. ఖర్గే, సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తుందని తెలిపారు. తనతో ఏదైనా సమస్య ఉంటే హైకమాండ్ తో మాట్లాడుకోవచ్చన్నారు. తెలంగాణ ప్రజల కోసం అవమానాలు ఎదుర్కోడానికి కూడా సిద్ధమని.. పార్టీ కోసం, ప్రజల కోసం పది మెట్లు కూడా దిగుతానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.