ఘనంగా ప్రారంభమైన ‘GTA మెగా కన్వెన్షన్ 2025’

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “GTA మెగా కన్వెన్షన్ 2025” ఘనంగా ప్రారంభమైంది.

Update: 2025-12-28 10:51 GMT

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “GTA మెగా కన్వెన్షన్ 2025” ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అక్షయ కన్వెన్షన్ సెంటర్‌లో డిసెంబర్ 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.

తొలి రోజు జరిగిన కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొని కార్యక్రమానికి విశేష శోభ చేకూర్చారు.

ఈ కన్వెన్షన్ కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస తెలంగాణ ప్రజల మేధస్సు, వనరులు, నెట్‌వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని GTA ఫౌండర్ & గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

నిర్వాహక బృందం కీలక పాత్ర

GTA ఫౌండర్ & గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి, USA ఫౌండర్ చైర్మన్ విశేశ్వర్ రెడ్డి కల్వల, ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాడురి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ కంకణాల అభిషేక్ రెడ్డి, అడ్వైజరీ చైర్ ప్రతాప్ రెడ్డి పెండ్యాల, సహ వ్యవస్థాపకుడు శ్రవణ్ రెడ్డి పాడురు, USA ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, వాషింగ్టన్ ప్రెసిడెంట్ రాము ముండ్రాతి తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

కార్యక్రమ హైలైట్స్

♦ 100 మందికి పైగా కళాకారులతో తెలంగాణ జానపద, శాస్త్రీయ కళారూపాల ప్రదర్శనలు

♦ మంగ్లీ లైవ్ మ్యూజికల్ నైట్, మోహన భోగరాజు ప్రత్యేక ప్రదర్శన

♦ అహా ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఎంటర్టైన్‌మెంట్ షో

♦ అతిథుల కోసం 35 రకాల తెలంగాణ సంప్రదాయ వంటకాలు

♦ “GTA ఫ్యాషన్ షో 2025” – తెలంగాణ వారసత్వ ప్రతిబింబం

రెండో రోజు ప్రత్యేక సెషన్లు

రియల్ ఎస్టేట్, స్టార్టప్‌లు, ఎన్ఆర్ఐ లీగల్ అంశాలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలపై మాస్టర్‌క్లాసులు, చర్చలు జరుగనున్నాయి. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ కింద రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ భాగస్వామ్యం, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి.

ముగింపు కార్యక్రమం

డిసెంబర్ 28 సాయంత్రం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, GTA కొత్త నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కాన్సర్ట్‌తో ఈ మహాసభలు ముగియనున్నాయి.

ప్రపంచ తెలంగాణ బిడ్డలను ఒకే తాటిపైకి తీసుకొచ్చిన ఈ మహాసభలు హైదరాబాద్‌లో ఘనంగా కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News