Revanth Reddy: ఫార్మా సిటీపై అపోహలు వద్దు.. అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం
Revanth Reddy: హైదరాబాద్‌ను ప్రపంచంతో వేగంగా పోటీపడేలా పనిచేస్తాం
Revanth Reddy: ఫార్మా సిటీపై అపోహలు వద్దు.. అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం
Revanth Reddy: ఫార్మా సిటీపై పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఫార్మాసిటీపై ఎలాంటి అపోహలకు గురికావొద్దని సూచించారు. నానక్‌రామ్ గూడలో ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్.. అభివృద్ధిపై తమకు స్పష్టమైన విధానాలున్నాయని తెలిపారు. పరిపాలనపై అవగాహన రావడానికి సమయం పడుతుందని తెలిపారు. తొందరపాటు లేకుండా అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని.. హైదరాబాద్‌ను ప్రపంచంతో వేగంగా పోటీపడేలా పనిచేస్తామని అన్నారు సీఎం రేవంత్.