Hyderabad: హైదరాబాద్ మెట్రో రైళ్లలో రాయితీ సమయం కుదింపు
Hyderabad: స్మార్ట్ మెట్రో కార్డులు, క్యూఆర్ కోడ్ టికెట్లకు 10 శాతం రాయితీ
Hyderabad: హైదరాబాద్ మెట్రో రైళ్లలో రాయితీ సమయం కుదింపు
Reduction Of Concession Time In Hyderabad Metro Train
Hyderabad: హైదరాబాద్ మెట్రో రైళ్లలో రాయితీ సమయం కుదించారు. స్మార్ట్ మెట్రో కార్డులు, క్యూఆర్ కోడ్ టికెట్లకు 10 శాతం రాయితీ వర్తిస్తుంది. రద్దీ సమయాల్లో 10 శాతం రాయితీని ఎత్తివేశారు. నేటి నుంచి రద్దీ లేని సమయాల్లో 10 శాతం రాయితీ వర్తిస్తుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తించేలా నిబంధనలు సవరించారు. కాగా సూపర్ సేవర్ హాలీ డే యథావిధిగా వర్తిస్తుంది. కానీ కార్డు ధరను 59 రూపాయల నుంచి 99 రూపాయలకు పెంచారు. 99 రూపాయలతో నిర్దేశించిన సెలవురోజుల్లో అపరిమితంగా ప్రయాణించొచ్చు. హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రతి రోజూ 4.4 లక్షల మంది ప్రయాణిస్తుండగా.. కొత్త నిబంధనలు రానున్న మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయి.