రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల అక్ర‌మ ప్రాజెక్టే : మంత్రి వేముల‌

Rayalaseema Lift Irrigation: కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా వాడుకుంటోందని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మరోసారి ఆరోపించారు.

Update: 2021-06-24 12:20 GMT

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల అక్ర‌మ ప్రాజెక్టే : మంత్రి వేముల‌

Rayalaseema Lift Irrigation: కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా వాడుకుంటోందని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మరోసారి ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టే అన్నారు. ప్రాజెక్టు, అలాగే కాలువ పనులను నిలిపివేయాలని కృష్ణా బోర్డ్, ఎన్జీటీ ఆదేశించినప్పటికీ ఏపీ పనులు కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఆంధ్ర ప్రాంత నాయ‌కులు దీనికి ఏం స‌మాధానం చెబుతారు అని మంత్రి ప్ర‌శ్నించారు. కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆదేశంతో రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల అక్ర‌మ‌మ‌ని తేలిపోయింద‌న్నారు.

డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు క‌ట్ట‌వ‌ద్ద‌ని బోర్డు స్ప‌ష్టంగా చెప్పింద‌న్నారు. కృష్ణా బోర్డు ఆదేశాల ప్ర‌కారం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌నులు ఆపాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్‌ను డిమాండ్ చేస్తున్నామ‌ని మంత్రి వేముల పేర్కొన్నారు. గ్రీన్ ట్రిబ్యున‌ల్ కూడా రాయ‌లసీమ ప్రాజెక్టుల‌ను క‌ట్టొద్ద‌ని ఆదేశించిన విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేయాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News