Ramadan: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రంజాన్‌ వేడుకలు.. మసీదులు, ఈద్గాల దగ్గర ముస్లింల ప్రత్యేక పార్థనలు

Ramadan: మసీదులు, ఈద్గాల దగ్గర ముస్లింల ప్రత్యేక పార్థనలు

Update: 2024-04-11 06:38 GMT

Ramadan: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రంజాన్‌ వేడుకలు.. మసీదులు, ఈద్గాల దగ్గర ముస్లింల ప్రత్యేక పార్థనలు 

Ramadan: హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం తర్వాత బుధవారం సాయంత్రం నెల వంక కనిపించింది. హైదరాబాద్ మక్కా మసీదు, మీరలం ఈద్గా, మాసబ్ ట్యాంక్ మసీదుల్లో ముస్లిం సోదరులు నమాజ్ చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో చిన్నారులు, యువకులు, వృద్ధులు వందాలాదిగా ఈద్గాలకు తరలివచ్చి ప్రత్యేక సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. ముస్లింల మత గురువులు రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్ దగ్గర 200 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మల్లించారు. ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News