రాజాసింగ్‌ లాయర్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ..

Raja Singh: రాజాసింగ్‌ న్యాయవాది కరుణాసాగర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.

Update: 2022-08-24 10:30 GMT

రాజాసింగ్‌ లాయర్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ..

Raja Singh: రాజాసింగ్‌ న్యాయవాది కరుణాసాగర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనను చంపుతామంటూ పలు దేశాల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు లాయర్‌ కరుణాసాగర్‌. రాజాసింగ్ కేసు వాదించినందుకు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు చెప్పారు. రాజాసింగ్‌కు బెయిల్ ఇప్పించి రిమాండ్ రిజక్ట్ చేసినందుకు తనను బెదిరిస్తున్నారని తన న్యాయవాది వృత్తిని తాను నెరవేర్చానని చెబుతున్నారు కరుణాసాగర్‌.

పోలీసుల వైఫల్యంతోనే రిమాండ్ రిజక్ట్ అయ్యిందన్న కరుణాసాగర్ నిన్నటి నుంచి తనకు కొంతమంది ఆకతాయిలు ఫోన్లు చేసి, చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. దుబాయ్ నుంచి ఈ కాల్స్‌ వచ్చినట్టు లాయర్‌ కరుణాసాగర్ చెబుతున్నారు. ఈ బెదిరింపులకు తాను భయపడనని ఈ కాల్స్‌పై పోలీసులు స్పందించాలని డిమాండ్ చేశారు రాజాసింగ్‌ లాయర్‌ కరుణాసాగర్‌.

Tags:    

Similar News