Raja Singh: గోషామహల్‌లో గెలుపు నాదే.. అభ్యర్థి ఎవరనేది నిర్ణయించేది కేసీఆర్ కాదు.. మజ్లిస్ పార్టీ..
Raja Singh: గోషామహల్ బీఆర్‌ఎస్ అభ్యర్థిని కేసీఆర్ నిర్ణయించకపోవడంపై సెటైర్లు వేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.
Raja Singh: గోషామహల్‌లో గెలుపు నాదే.. అభ్యర్థి ఎవరనేది నిర్ణయించేది కేసీఆర్ కాదు.. మజ్లిస్ పార్టీ..
Raja Singh: గోషామహల్ బీఆర్‌ఎస్ అభ్యర్థిని కేసీఆర్ నిర్ణయించకపోవడంపై సెటైర్లు వేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. గోషామహల్ అభ్యర్థి ఎవరనేది నిర్ణయించేది కేసీఆర్ కాదని, మజ్లిస్ పార్టీ అని చురకలు అంటించారు. మజ్లిస్ పార్టీ ఏ అభ్యర్థిని ప్రకటిస్తే.. ఆ అభ్యర్థిని కేసీఆర్ ఫైనల్ చేస్తారని విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ప్రేమ్‌సింగ్ రాథోడ్‌ను మజ్లిస్ ఫైనల్ చేసిందని చెప్పారు. ఈ సారి కూడా గోషామహల్‌లో తనదే గెలుపని, బీజేపీ రాష్ట్ర స్థాయి నేతల అండదండలు తనకున్నాయని అన్నారు రాజాసింగ్.