Rahul Gandhi: టీఆర్ఎస్ BRSగా మారడంపై రాహుల్ గాంధీ సెటైర్లు.. పొత్తుపై కూడా తేల్చేశారు..

Rahul Gandhi: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌ గాంధీ స్పందించారు.

Update: 2022-10-31 10:50 GMT

Rahul Gandhi: టీఆర్ఎస్ BRSగా మారడంపై రాహుల్ గాంధీ సెటైర్లు.. పొత్తుపై కూడా తేల్చేశారు..

Rahul Gandhi: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. జోడో యాత్రలో భాగంగా తెలుగు మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన రాహుల్‌ అసలు పార్టీలకు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. అదంతా అవినీతి సంపద అన్న రాహుల్‌.. బీజేపీ, టీఆర్ఎస్‌ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి సంపదతో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని రాహుల్‌ ఆరోపించారు.

టీఆర్ఎస్‌తో పొత్తు ఉండొద్దన్నది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయమని.. దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడంలో తమకు ఎలాంటి అభ్యంతరం, ఇబ్బంది లేదని అన్నారు. ఏ నాయకుడికైనా తన పార్టీని తనకు నచ్చిన విధంగా ఊహించుకునే హక్కు ఉందని కామెంట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి తాను ఒక జాతీయ పార్టీని నడుపుతానని అనుకుంటే అందులో తప్పేమీ లేదన్నారు. కేసీఆర్ ఒక అంతర్జాతీయ పార్టీని నడుపుతున్నానని అనుకున్నా.. అందులో నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ జాతీయ స్థాయిలోనే కాదు.. అమెరికా, చైనాలో కూడా పోటీ చేయవచ్చంటూ సెటైర్ వేశారు రాహుల్ గాంధీ.

Tags:    

Similar News