Rahul Gandhi: హైదరాబాద్ లో ఉన్నా, ఢిల్లీకి తిరిగినా టికెట్లు రావు
Rahul Gandhi: పార్టీ లైన్ దాటి ఎవరు వ్యవహరించినా ఉపేక్షించబోము
Rahul Gandhi: హైదరాబాద్ లో ఉన్నా, ఢిల్లీకి తిరిగినా టికెట్లు రావు
Rahul Gandhi Warning: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధినేత రాహుల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా రెండోరోజు గాంధీభవన్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన భవిష్యత్తులో వ్యవహారించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పార్టీలో పనిచేసేనోళ్లకే టికెట్లు ఇస్తామన్న ఆయన హైదరాబాద్ ఉన్నా ఢిల్లీ చుట్టు తిరిగినా టికెట్లు రావన్నారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి సీనియర్ అయినా పార్టీని నుంచి బహిష్కరిస్తామన్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్ని ప్రజలతో మమేకం అయిన వారికి మాత్రమే అవకాశాలు ఉంటాయన్నారు. పార్టీలో కష్టపడి పనిచేస్తే టికెట్లు ఇస్తామన్నారు. ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే పార్టీ టికెట్ల నిర్ణయం తీసుకుంటామన్నారు. వరంగల్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే టాస్క్ ఈ రెండు నెలల్లో పార్టీ నేతలు పూర్తిచేయాలన్నారు.