Puvvada Ajay: పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి

Puvvada Ajay: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రతి గ్రామం పచ్చదనంతో పరిఢవిల్లుతుందని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు.

Update: 2021-06-17 15:45 GMT

పువ్వాడ అజయ్‌(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Puvvada Ajay: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రతి గ్రామం పచ్చదనంతో పరిఢవిల్లుతుందని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. ఈ ఏడాది కూడా పల్లె ప్రగతి కార్యక్రామన్ని విజయవంతం చేయాలని సూచించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజనల్‌ వ్యాధుల నివారణ, పారిశ్యుద్ధ పనులతోపాటు పలు పెండిగ్‌ పనులపై చర్చించారు.

20వ తేదీ నుంచి జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం గా ఉండాలన్నారు. నేటి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు కథనరంగంలోకి దిగాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి పేర్కొన్నారు. గత పట్టణ, పల్లె ప్రగతిలో చేపట్టిన పనులలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. కాగా, అతి తక్కువ శాతంలో కొన్ని డంపింగ్ యార్డులు, వైకుంఠధామం లు ప్రారంభం కాలేదన్నారు. వాటికి తక్షణమే స్థానిక ప్రజాప్రతినిధులు పునుకొని వాటిని ప్రారంభించి వాడుకలోకి తేవాలన్నారు.

Tags:    

Similar News