ఖమ్మం మార్కెట్‌లో మిర్చికి రికార్డు స్థాయి ధర.. జెండా పాటలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్
Khammam: క్వింటాకు రూ.25,550 మద్ధతు ధర
ఖమ్మం మార్కెట్‌లో మిర్చికి రికార్డు స్థాయి ధర.. జెండా పాటలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్
Khammam: మిర్చి పండించిన రైతుల ఇంట్లో సిరులు కురుస్తున్నాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం మిర్చి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఒక క్వింటాకు 25 వేల 5వందల 50 రూపాయలు వెచ్చించి.. ఖరీదు దారుడు కొనుగోలు చేశారు. దీంతో మిర్చి పండించిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మార్కెట్ పర్యవేక్షించిన నేపథ్యంలో... ఆయన సమక్షంలోనే జండా పాటను 25 వేల 5 వందల 50 రూపాయల మద్దతు ధర రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.