Harish Rao: రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దు

Harish Rao: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాట్లాడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాల కోసం రాష్ట్ర పరువు తీస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.

Update: 2025-12-22 09:20 GMT

Harish Rao: రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దు

Harish Rao: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాట్లాడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాల కోసం రాష్ట్ర పరువు తీస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పాలనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

తెలంగాణను ఆర్థికంగా పరిపుష్టి చేసిన ఘనత కేసీఆర్‌దేనని హరీశ్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని రేవంత్‌ అనడం సిగ్గుచేటని, రాజకీయాల కోసం తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయొద్దని హితవు పలికారు.

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు పెట్టి పీసీసీ పదవిని కొనుగోలు చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పదవుల కోసం పాకులాడే తత్వం తమది కాదని, తెలంగాణ కోసం ఎమ్మెల్యే, మంత్రి పదవులను గడ్డిపోచల్లా త్యాగం చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ నేతలదని గర్వంగా చెప్పారు.

రేవంత్ రెడ్డి తన ఎదుగుదల కోసం సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ వచ్చారని, అలాంటి వ్యక్తి తమ నాయకత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. నిజాయతీకి, నిబద్ధతకు కేసీఆర్ నాయకత్వం మారుపేరని ఆయన పునరుద్ఘాటించారు.

Tags:    

Similar News