Protest at Khairatabad RTA Office: ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Protest at Khairatabad RTA Office: నగరంలోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఉధ్రిక్త వాతావరనం నెలకొంది.

Update: 2020-06-29 06:24 GMT

Protest at Khairatabad RTA Office: నగరంలోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఉధ్రిక్త వాతావరనం నెలకొంది. తమిళనాడు, ఆంద్రప్రదేశ్, కేరళ బార్డర్ టాక్స్ ఏడాది కాలం పాటు రద్దు చేయాలంటూ, తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ పర్మిషన్ ఇవ్వాలంటూ స్టేట్‌ క్యాబ్స్‌ అండ్‌ బస్‌ ఆపరేటర్‌ అసోసియేషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. అసోసియేషన్ సభ్యులంతా సోమవారం ఉదయమే భారీ సంఖ్యలో బస్సుల్లో ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్నారు. బస్సులను రోడ్డు పై నిలిపి ధర్నాకు దిగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆర్టీఏ కార్యాలయం ముందు మొహరించి నిరసనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసారు. తమను ఎంత చెదరగొట్టినా తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ధర్నాను విరమించబోమని తెలంగాణ స్టేట్ క్యాబ్ అండ్ బస్ ఆపరేటర్ అసోసియేషన్‌ తేల్చి చెప్పింది.

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌ క్యాబ్‌ అండ్‌ బస్‌ ఆపరేటర్‌ ప్రెసిడెంట్‌ సయ్యద్‌ నిజాముద్దీన్‌ మాట్లాడుతూ ఆంధ్ర, తమిళనాడు, కేరళకు వేళ్లే వాహనాల బార్డర్‌ టాక్సులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సింగిల్‌ పర్మిషన్‌ ఇవ్వాలని కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలలుగా బస్సులు రోడ్డు ఎక్కలేదన్నారు.

Tags:    

Similar News