Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపుల కేసులో పురోగతి

Raja Singh: ఇంటర్‌నెట్‌ ప్రోటోకాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్న ఖాసిం

Update: 2024-01-20 10:13 GMT

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపుల కేసులో పురోగతి 

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపుల కేసులో పురోగతి సాధించారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. గత కొంతకాలంగా రాజాసింగ్‌కు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ ఘటనపై రాజాసింగ్‌ పోలీసులను సైతం ఆశ్రయించారు. బెదిరింపు కాల్స్‌ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. రాజాసింగ్‌ కంప్లయింట్‌తో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్.. బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని గుర్తించింది. కువైట్‌లో మకాం వేసిన మహమ్మద్ ఖాసిం నిందితుడిగా తెలిపింది. 14 ఏళ్లుగా కువైట్‌లో మహమ్మద్ ఖాసిం ఉంటున్నాడు. చాంద్రాయణగుట్ట నుంచి దుబాయ్‌కి వెళ్లి.. అక్కడి నుంచి కువైట్‌లో ఖాసిం సెటిల్‌ అయ్యాడు. మహమ్మద్‌ ఖాసిం కోసం L.O.C. ని జారీ చేసింది సైబర్‌ క్రైమ్. ఇంటర్‌నెట్‌ ప్రోటోకాల్ ద్వారా ఖాసిం.. బెదిరింపులకు పాల్పడుతున్నట్టు గుర్తించింది.

Tags:    

Similar News