ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర కేసులో దర్యాప్తు వేగవంతం.. తన భర్తను కావాలనే టార్గెట్ చేశారని లావణ్య ఆరోపణ

Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Update: 2022-08-02 09:40 GMT

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర కేసులో దర్యాప్తు వేగవంతం.. తన భర్తను కావాలనే టార్గెట్ చేశారని లావణ్య ఆరోపణ

Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో నిందితుడు ప్రసాద్ గౌడ్ ఉండగా నిందితుడి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రెండు గన్‌లతో పాటు ఒక కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఒకటి ఎయిర్ గన్‌గా గుర్తించారు. ఇక రివాల్వర్‌లో బుల్లెట్స్ లేవని తేల్చారు పోలీసులు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు ప్రసాద్ గౌడ్ జీవన్‌రెడ్డి ఇంట్లోకి చొరబడిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

మరోవైపు తన భర్తను కావాలనే ఈ కేసులో ఇరికించారని కిల్లెడ సర్పంచ్ లావణ్య ఆరోపిస్తోంది. బిల్లులు ఆగిపోవడంతో జీవన్‌రెడ్డిని, జిల్లా కలెక్టర్‌కు కలిశామని, కానీ ఇంత వరకు విడుదల చేయలేదని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న జీవన్‌రెడ్డిని కలిసేందుకు వెళ్లిన తన భర్తపై కావాలనే హత్యకు కుట్ర కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తన భర్త గన్‌లు, కత్తులు తీసుకెళ‌్లలేదని లావణ్య చెబుతోంది.

Tags:    

Similar News