Priyanka Chopra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్బంగా తనకు దర్శన ఏర్పాట్లు చేసిన ఉపాసన కొణిదెలకు ధన్యవాదములు చెప్పారు. మహేశ్ బాబు, రాజమౌళి మూవీ కోసమే ప్రియాంక హైదరాబాద్ కు వచ్చినట్లు నెట్టింట్లో వార్తలు వైరల్ గా మారాయి.
తిరుపతి బాలాజీని దర్శించుకున్న ప్రియాంక చోప్రాకు ఆలయ ప్రధాన అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త జర్నీ మొదలు పెడుతున్న పోస్టులో పేర్కొన్నారు. శ్రీ బాలాజీ ఆశీస్సులతో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మనందరం మన హృదయాలలో శాంతి, శ్రేయస్సు సమృద్ధిని పొందుదాం. దేవుడి దయ అనంతరం. ఓం నమః నారాయణ అని ఆమె పోస్టులో రాసుకొచ్చారు. చివరిలో రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు ధన్యవాదములు తెలిపారు. దీన్ని బట్టి ఉపాసన ఆమెకు దర్శన ఏర్పాట్లు చేసిందని అర్థం అయ్యింది.
లాస్ ఏంజెలెస్ నుంచి ప్రియాంక కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి డైరెస్ట్ చేస్తున్న SSMB29లో ప్రియాంకను హీరోయిన్ గా తీసుకున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సినిమాను ఉద్దేశించే కొత్త ప్రయాణాన్ని చెప్పినట్లు పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే మూవీలో ఆమె హీరోయిన్ అని ప్రకటిస్తూ మూవీ టీం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.