Manickam Tagore: కాంగ్రెస్ పార్టీలో ప్రెసిడెంట్ ఓ కెప్టెన్ మాత్రమే.. ప్రియాంక గాంధీ తెలంగాణ బాధ్యతలు..
Manickam Tagore: కాంగ్రెస్ పార్టీ అంటే ఏ ఒక్కరూ కాదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు.
Manickam Tagore: కాంగ్రెస్ పార్టీలో ప్రెసిడెంట్ ఓ కెప్టెన్ మాత్రమే.. ప్రియాంక గాంధీ తెలంగాణ బాధ్యతలు..
Manickam Tagore: కాంగ్రెస్ పార్టీ అంటే ఏ ఒక్కరూ కాదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డికి కరోనా సీఎల్పీ బృందం అందుబాటులో లేని సమయంలో సమావేశం నిర్వహిస్తున్నారని రిపోర్టర్లు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఠాగూర్ రేవంత్ కెప్టెన్ మాత్రమేనని కామెంట్ చేశారు. పార్టీ అంటే లక్షలాది మంది కార్యకర్తలని పేర్కొన్న ఠాగూర్ సీనియర్లను సమావేశానికి పిలవలేదని చెప్పారు.
గాంధీ భవన్‌లో జరిగిన సమావేశంలో మాణిక్కం ఠాగూర్ ఈ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రెసిడెంట్ ఓ కెప్టెన్ మాత్రమేనని అన్నారు. పార్టీకి నాయకులు కాదు పార్టీనే ముఖ్యమన్నారు. మర్రి శశిధర్ రెడ్డి కామెంట్స్ చూడలేదని చెప్పారు. ప్రియాంక గాంధీ తెలంగాణ బాధ్యతలు చేపట్టడం సంతోషమే అన్నారు. తెలంగాణ పరిణామాలను ప్రియాంక గాంధీ నిత్యం గమనిస్తున్నారని మాణిక్కం ఠాగూర్ చెప్పారు.