Telangana: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ

Telangana: జాతీయ రాజకీయాలు, బీజేపీ వ్యతిరేక కూటమి.. కాంగ్రెస్‌ ప్రభావంపై కేసీఆర్‌తో చర్చిస్తున్న పీకే

Update: 2022-04-24 08:45 GMT

Telangana: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ

Telangana: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ వ్యతిరేక కూటమి, కాంగ్రెస్‌ ప్రభావంపై కేసీఆర్‌తో చర్చిస్తున్నారు ప్రశాంత్ కిశోర్. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో లంచ్‌ అనంతరం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు ప్రశాంత్ కిశోర్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. దేశ రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తున్న సీఎం కేసీఆర్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నపీకే చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. పీకే ప్రగతి భవన్ కు రావడం కేసీఆర్ తో జాతీయ రాజకీయాలపై చర్చించడంపై జాతీయస్థాయిలో పార్టీలు చర్చించుకుంటున్నాయ్. ఐతే కాంగ్రెస్ లో చేరే పీకేకు టీఆర్ఎస్ తో పనేంటన్న వర్షన్ కూడా విన్పిస్తోంది. కాంగ్రెస్ తరపున పీకే హైదరాబాద్ వచ్చారా? లేదంటే సొంత అసైన్మెంట్ లో భాగంగానా అనేది తేలాల్సి ఉంది. పీకే కాంగ్రెస్ లో చేరాక టీఆర్ఎస్ కు సేవలు ఎలా అందిస్తారన్న అభిప్రాయం కూడా ఉంది. అందుకే టీఆర్ఎస్ ఐప్యాక్ తో సేవలను తీసుకోబోతుందా అన్నది తేలాల్సి ఉంది.

పీకే హైదరాబాద్ టూర్ పై భిన్నవర్షన్లు విన్పిస్తున్నాయ్. కేసీఆర్ -పీకే చర్చల వెనుక సరికొత్త స్ట్రాటజీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్న ప్రశాంత్ కిషోర్ దేశంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం భారీ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి వెళ్లాలని పీకే కాంగ్రెస్ పెద్దలకు సూచించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 370 స్థానాల్లోనే హస్తం పోటీ చేసి మిగతా స్థానాల్లో మిత్రులకు వదిలేయాలని పీకే చెప్పారట. భాగస్వామ్యపక్షాలతో కలిసి పోటీ చేస్తే ఉభయులకు లాభముంటుందని పీకే రిపోర్ట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయ్. అందుకే మొత్తం బాధ్యతను సైతం కాంగ్రెస్ పార్టీ పీకేకు అప్పగించినట్టు తెలుస్తోంది. తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ బీహార్ లో జేడీయూ, తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీతో పీకే త్వరలో చర్చలు జరపనున్నారు. అందులో భాగంగానే భాగంగానే పీకే, కేసీఆర్ తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News