మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం
Munugode: ప్రజలారా.. మేం మోసపోయాం.. మీరు మోసపోకండి..
మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం
Munugode: మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో మునుగోడు ప్రజలారా.. మేం మోసపోయాం.., మీరు మోసపోకండి అంటూ దుబ్బాక, హుజూరాబాద్ ప్రజల పేరుతో పోస్టర్లు అంటించారు. పట్టణం మొత్తం ఇలాంటి పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఇక చండూరు పట్టణంలో నేడే విడుదల అనే పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. అయితే మున్సిపల్ సిబ్బంది పోస్టర్లను తొలగించారు.