Suryapet: వీడు మామూలోడు కాదు.. పోలీస్ వాహనాన్నే కొట్టేశాడు..!
Suryapet: వీడు మామూలోడు కాదు.. పోలీస్వాహనాన్నే కొట్టేశాడు..!
Suryapet: వీడు మామూలోడు కాదు.. పోలీస్వాహనాన్నే కొట్టేశాడు..!
Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గత రాత్రి పోలీస్ వాహనాన్ని దుండగుడు అపహరించాడు. తెల్లవారుజామున 5 గంటలకు ఈ సంఘటన జరిగింది. గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వేరే కేసు కోసం వాహనాన్ని నిలిపివెళ్లారు. ఆ సమయంలో వాహనానికి తాళం ఉండడంతో అది చూసిన దుండగుడు వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. అనంతరం కోదాడలోని ఓ మద్యం దుకాణం ముందు నిలిపి పరారయ్యాడు. వాహనాన్ని చోరీ చేసిన దుండగుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.