మునుగోడు నియోజకవర్గంలో నోట్ల కట్టలు.. చల్మెడ చెక్‌పోస్ట్ దగ్గర కోటి రూపాయల నగదు స్వాధీనం
Munugode: పట్టుబడ్డ నగదుపై విచారణ చేస్తున్న పోలీసులు.. కరీంనగర్‌లోని ఓ పార్టీ నాయకుడికి చెందిన నగదుగా అనుమానం
మునుగోడు నియోజకవర్గంలో నోట్ల కట్టలు.. చల్మెడ చెక్‌పోస్ట్ దగ్గర కోటి రూపాయల నగదు స్వాధీనం
Munugode: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో.. పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు పట్టబడుతున్నాయి. నిన్నటి వరకు హైదరాబాద్‌లో కోట్లాది రూపాయలు పట్టుబడగా.. ప్రస్తుతం నియోజకవర్గంలోనే తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా మునుగోడు మండలం చల్మెడ చెక్‌పోస్ట్ పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా.. ఓ కారు నుంచి ఏకంగా కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదుపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే నగదు ఉన్న కారు.. కరీంనగర్ కు చెందిన ఓ పార్టీ నాయకుడిగా అనుమానిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల నగదు పట్టుబడగా.. నియోజకవర్గంలో ఇంత పెద్దమొత్తంలో దొరకడం ఇదే మొదటిసారి.