Madnoor: గ్రామంలో కార్టన్ సెర్చ్ 67ద్విచక్ర వాహనాలను సీజ్: జిల్లా ఎస్పీ

మండలంలోని దోతీ గ్రామంలో, గురువారం ఉదయం కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత రెడ్డి, డీఎస్పీ ఎస్ దామోదర్ రెడ్డి, డివిజన్ స్థాయి సీఐ, ఎస్సైలు పోలీస్ బృందాలతో కార్టన్ సెర్చ్ నిర్వహించారు.

Update: 2020-01-30 08:22 GMT

మద్నూర్: మండలంలోని దోతీ గ్రామంలో, గురువారం ఉదయం కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత రెడ్డి, డీఎస్పీ ఎస్ దామోదర్ రెడ్డి, డివిజన్ స్థాయి సీఐ, ఎస్సైలు పోలీస్ బృందాలతో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ప్రజలలో పోలీసులపై మంచి భరోసా కల్పించడానికే, కార్టన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నామని ఎస్పీ శ్వేతా రెడ్డి తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా, ఇలాంటి కార్టన్ సెర్చ్ నిత్యం నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామాల్లోని ప్రజలు పరిసర, చుట్టూ పక్కల కొత్త వ్యక్తులు ఎవరైన వచ్చినట్లు అనుమానం వస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, దొంగతనాలు జరగకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇటీవలే అనేక మంది మద్యం సేవించి వాహనాలను నడపడం ద్వారా, ప్రమాదాలకు గురై మృత్యు వాత పడుతున్నారని, ప్రతి వాహన దారుడు హెల్మెట్, సీటుబెల్ట్ ను తప్పకుండా ధరించి, రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించటం ద్వారా, రోడ్డు ప్రమాదానాలను అరికట్టవచ్చన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో, ఎలాంటి పత్రాలు లేని 67 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసారు. తనిఖీలో బిచ్కుంద సీఐ సాజిద్ ఉల్లా, బాన్సువాడ సీఐలు, డివిజన్ స్థాయి ఎస్సైలు, 90 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Tags:    

Similar News