Podem Veeraiah: రేవంత్‌రెడ్డి, ఖర్గేకు లేఖ రాసిన పొడెం వీరయ్య
Podem Veeraiah: ఎమ్మెల్సీతో పాటు మంత్రివర్గంలో చోటివ్వాలని డిమాండ్
Podem Veeraiah: రేవంత్‌రెడ్డి, ఖర్గేకు లేఖ రాసిన పొడెం వీరయ్య
Podem Veeraiah: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన పొడెం వీరయ్య ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. అంతే కాకుండా ఎమ్మెల్సీతోపాటు తనను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళుతుండటంతో పొడెం వీరయ్య లేఖపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.