Narendra Modi: నేడు హైదరాబాద్‌కు మోడీ
Narendra Modi: *శ్రీ రామానుజుల విరాట్ విగ్రహ ఆవిష్కరణ చేయనున్న ప్రధాని *ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ
Narendra Modi: నేడు హైదరాబాద్‌కు మోడీ
Narendra Modi: నేడు ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రానున్నారు. పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజాచార్య విరాట్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. మొదట శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ప్రధాని హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు, అనంతరం ముచ్చింతల్‌కు వస్తారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనలో గవర్నర్, కేంద్ర మంత్రులు, తదితర ప్రముఖులు పాల్గొంటారు.
సమతా స్ఫూర్తి కేంద్రంలో ప్రధాని సుమారు మూడు గంటల సేపు పర్యటిస్తారు. ఈ సందర్భంగా కేంద్రం విశిష్టతలను చిన జీయర్ స్వామి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించనున్నారు. ఇప్పటికే రామానుజాచార్య విగ్రహం, యాగశాలలను ప్రధాని హెలికాప్టర్ ద్వారా విహంగ వీక్షణం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఐదు నెలల తర్వాత ప్రధానిను కలుస్తున్నారు సీఎం కేసీఆర్.